ఎంసెట్‌, ఈసెట్ ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

ఎంసెట్‌, ఈసెట్ ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..
x
Highlights

ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్, ఈసెట్ తో పాటుగానే ఇతర ప్రవేశ పరీక్షలను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా వాయిదా వేసిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఓ స్పష్టతను ఇచ్చారు.

ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే నెలాఖరు వరకు పొడగిస్తే జూన్‌ మూడు లేదా నాలుగో వారానికి ఎంసెట్‌, ఈసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలను వాయిదావేస్తామని ఆయన తెలిపారు. అంతే కాకుండా డిగ్రీ విద్యార్ధులకు కూడా ఓ శుభవార్తను తెలియజేసారు. డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులను ఆన్‌లైన్‌లో విద్యార్థులు అందించడానికి ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ను కనిపెట్టారని, దాన్ని అమలు చేస్తామని వారు తెలిపారు. అంతే కాక డిగ్రీలో డిటెన్షన్‌ విధానాన్ని రద్దుచేస్తూ వర్సిటీలకు ఆదేశాలు జారీచేశామని ఆయన ఈ సందర్బంగా మీడియాకు వెల్లడించా రు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories