తెలంగాణలో మెడికల్ కాలేజీలను వణికిస్తున్న కరోనా భయం

తెలంగాణలో మెడికల్ కాలేజీలను వణికిస్తున్న కరోనా భయం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. మెడికల్ కాలేజీలను సైతం ఈ మహమ్మరి వణికిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. మెడికల్ కాలేజీలను సైతం ఈ మహమ్మరి వణికిస్తోంది. ఉస్మానియా మేడికల్ కాలేజి పరిధిలో 23 మందికి కరోనా సోకింది. నిమ్స్ హాస్పిటల్ లో నలుగురు కార్డియాలజిస్ట్ లు ముగ్గురు లాబ్ టెక్నీషియన్ లకు కరోనా సోకింది. గాంధీ హాస్పిటల్ లో నలుగురు పీజీ డాక్టర్ల కు కూడా కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది.

ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉన్న 280 మందికి క్వారంటైన్ వీరిలో ఇప్పటికే 250 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. 190 మంది ఫలితాలు వచ్చాయి ఇవాళ మరిన్ని ఫలితాలు రానున్నాయి. గాంధీ హాస్పిటల్ లో 270 మంది ,నిమ్స్ లో 100 మందికి పరీక్షల కోసం క్వారన్ టైన్లో ఉంచారు. భయం గుప్పెట్లో ఇంటెన్షిప్ ,పీజీ వైద్య విద్యార్థులు ఇంటెన్షిప్ ,పీజీ వైద్య విద్యార్థులను కూడా కరోనా భయం వెంటాడుతుంది. సుమారు ఐదు వందల మందికి పైగా వైద్య విద్యార్థులను క్వారంటైన్ చేసే యోచనలో వైద్య అధికారులు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories