Lock Down: మమ్మల్ని స్వగ్రామానికి రప్పించండి

Lock Down: మమ్మల్ని స్వగ్రామానికి రప్పించండి
x
Highlights

పాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన యువకులు కరోనా విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ తో పని లేక, తిండికి అవస్థలు పడుతూ, స్వగ్రామానికి రాలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు.

గంగాధర: ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన యువకులు కరోనా విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ తో పని లేక, తిండికి అవస్థలు పడుతూ, స్వగ్రామానికి రాలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా లో చిక్కుకున్న ఎలాగైనా స్వగ్రామానికి రప్పించాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ కు చెందిన సుమారు 30 మంది యువకులు ట్రాక్టర్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పార్వతీపురం లో బ్లేడ్ ట్రాక్టర్లతో పనులు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో 20 రోజులుగా పనులు సాగక ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పనులు లేక, ఇటు ఇంటికి వెళ్లలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. పని లేకపోవడంతో ఉన్న డబ్బులతో కాలం వెల్ల తీశామని, ప్రస్తుతం చేతిలో డబ్బులు అయిపోయినట్లు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి తమ స్వగ్రామానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories