Coronavirus: తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

Again Corona Cases Hike in Telangana
x

కరోనా (ఫైల్ ఫోటో )

Highlights

Coronavirus: వైరస్ బాధితులు పెరుగుతుండడం తో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం

Coronavirus: తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది..వైరస్ బాధితులు పెరుగుతుండడం తో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది...కరోనా సోకిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది...తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ మైంటైన్ చెయ్యాలని మస్కులు ధరించాలని సూచిస్తున్నారు అధికారులుమరో వైపు స్కూల్స్,కాలేజీలు తెరుచుకోవడం తో రద్దీ వలన కేసులు పెడుగుతుండడం తో భయపడుతున్నారు తల్లిదండ్రులు.

తెలంగాణలో మళ్ళీ కరోనా ఉధృతి పుంజుకుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 170 కి పైగా డిశ్చార్జ్ కాగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేళా 17 వందల మంది వైరస్ చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. హైదరాబాద్ GHMC పరిధిలో ఎక్కువ కేసులు ఉండగా... జిల్లాలో కూడా అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు...

తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమే అని వైద్యులు చెబుతున్నారు. మళ్లీ కేసుల సంఖ్య పెరగడంతో మళ్ళీ లక్డౌన్ ఉండే పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు... స్కూల్స్ లో ఇప్పటికే అత్యధిక కేసులు రావడం చిన్న పిల్లల్లో మొన్నటి వరకు తక్కువ నమోదు అయిన ఇప్పుడు ఒకరి నుండి ఒకరికి వైరస్ వేగగంగా వ్యాప్తి చెందడం వలన కేసులు చిన్న పిల్లల్లో వస్తున్నాయని అంటున్నారు వైద్యులు. కచ్చితంగా స్కూల్స్ లో కఠిన ఆంక్షలతో ఉంటే కానీ కేసులు తగ్గించలేమంటున్నారు వైద్య నిపుణులు.

ఒక వైపు కేసులు పెరగడం.. మరో వైపు వ్యాక్సిన్ ప్రక్రియ జరగడం కొనసాగుతున్న ఇంకా వ్యాక్సిన్ అంటే జనం భయపడుతూనే ఉన్నారని వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర ఉన్న వైద్య సిబంది అంటున్నారు... వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల్లో మళ్ళీ పాజిటివ్ వచ్చిందని వస్తున్న వారు ఉన్నారంటున్నారు... రోజు వారి టార్గెట్ కి తగిన విధంగా వ్యాక్సిన్ వేసుకోడానికి వస్తున్నారని అంటున్నారు... మొదటి డోస్ పూర్తి అయ్యి రెండవ డోస్ తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పిస్తున్నాం అని అంటున్నారు వైద్య సిబంది.

కరోనా కేసులు మళ్ళీ భయపెడుతుండడంతో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజల నిర్లక్ష్యానికి అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడుతున్నాయి.. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories