అలా కానీ చేస్తే టీకా తీసుకున్నా ఫలితం ఉండదు..తీసుకోవలసిన జాగ్రత్తలు

Corona Vaccination guide lines
x

కరోనా టీకా (ప్రతీకాత్మక చిత్రం)

Highlights

* టీకా వేసుకున్నవారికి వైద్య,ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు * టీకా తొలి డోసుతో యాంటీబాడీల వృద్ధి ప్రారంభం * శరీరంలో సంభవించే మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు * 28వ రోజు టీకా రెండో డోసు వేయించుకోవడం తప్పనిసరి

కరోనా వైరస్ టీకా వచ్చేసింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా ఇవ్వడం మొదలు అయింది. దీంతో అందరిలోనూ కరోనా తో ఇక ఇబ్బంది లేదనే అపోహ ఏర్పడిపోయింది.

కానీ, టీకా వచ్చినా కొన్నిరోజుల పాటు జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఈమేరకు దేశంలో కొవిడ్‌ టీకా తొలి డోసు పొందినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు వైద్య వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. యాంటీబాడీలు తయారయ్యే క్రమంలో అజాగ్రత్త వల్ల వైరస్‌ సోకితే... టీకా పొందినా ఉపయోగం ఉండదని నిపుణులు అంటున్నారు. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత లబ్ధిదారులకు వైరస్‌ సోకినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉండదు. కానీ వీరి ద్వారా ఇతరులకు వ్యాపించొచ్చు. అందుకే టీకా పొందినవారూ మాస్కు, చేతుల శుభ్రత వంటి జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలు ఎందుకుండాలి? 28వ రోజునే ఎందుకు రెండో డోసు తీసుకోవాలి? పూర్తి రక్షణకు 42 రోజుల సమయం ఎందుకు? తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన అవసరం. టీకా వేసుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని విరివిగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. కరోనా టీకా వేసుకున్నాక ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. తొలి టీకా వేసుకున్నాక 28 రోజులపాటు మానవ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని తెలిపింది. టీకా వేసుకున్న నాలుగు రోజుల పాటు మద్యం, పొగతాగకూడదని హెచ్చరించింది. మంచి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.

వ్యాక్సిన్‌ ప్రవేశించగానే శరీరంలో అనేక కీలకమైన మార్పులు, చర్యలు ప్రారంభం అవుతాయి. యాంటీబాడీలు తయారయ్యే క్రమం మొదలవుతుంది. ఆ సమయంలో సరైన ఆహార నియమాలు పాటించాలని డాక్టర్లు స్పష్టం చేశారు. కలుషిత ఆహారం తిన్నా, నీరు తాగినా, మద్యం ముట్టినా యాంటీబాడీల వృద్ధికి విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. అంతేకాదు యాంటీబాడీలు తయారయ్యే క్రమంలో మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఒకవేళ ఆ సమయంలో కరోనా వైరస్‌ ప్రవేశిస్తే, వ్యాక్సిన్‌ వల్ల ఉపయోగం ఉండదని ఆరోగ్య శాఖ తేల్చింది.

తొలి డోసు వ్యాక్సిన్‌ వేసుకున్న దాదాపు 12 రోజులకు 30 నుంచి 40 శాతం మేరకు యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. 28 రోజుల నాటికి 60 నుంచి 70 శాతం వరకు ఏర్పడుతాయి. రెండో డోసు వేసుకున్న రెండు వారాలకు శరీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు తయారవుతాయి. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ను 28 రోజులకు రెండుమూడు రోజులు అటుఇటు ఎప్పుడైనా వేసుకోవచ్చని తెలిపారు. రెండు డోసుల తర్వాత కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా సీరియస్‌ కాదని వెల్లడించారు. అయితే టీకా వేసుకున్న వారిలో కరోనా వైరస్‌ ఉంటే మాత్రం ఇతరులకు వ్యాపింపే అవకాశం ఉందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories