ఇంకా తొలగని కరోనా భయం..

Corona Fear Still Unresolved
x

Corona Fear Still Unresolved

Highlights

* కరోనా వచ్చి తగ్గిన వారిలో దీర్ఘకాలిక రోగాలు * ఇమ్యూనిటీని దెబ్బ తీస్తున్న కరోనా వైరస్ * ఊపిరితిత్తులు, గుండె జబ్బులపై ప్రభావం చూపిస్తున్న కరోనా

ఒక వైపు కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ కూడా వారం పది రోజుల్లో నయం అవుతోంది. కానీ, ఈ వైరస్ వలన వచ్చే రోగాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయంటున్నారు డాక్టర్లు చిన్న రోగాల నుంచి పెద్ద గుండె జబ్బులు వంటివి వస్తున్నాయంటున్నారు. కరోనా మనిషి ఇమ్యూనిటీ సిస్టంని దెబ్బ తీస్తుందని చెబుతున్నారు.

కరోనాతో జనం గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు నెలల నుంచి కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇక కరోనాకి మంచి ట్రీట్మెంట్ అందుతుండడంతో వారం పది రోజుల్లో రికవరీ అవుతున్నారు. కరోనా కొందరిలో మాత్రం సివియర్‌గా చూపిస్తోంది. కానీ, కరోనా వచ్చి పోయిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులను తీసుకొని వస్తున్నాయి.

కరోనా వచ్చి పోయిన వారిలో దాని ఎఫెక్ట్ రెండు మూడేళ్ల వరకు ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. గుండె జబ్బుల నుంచి స్కిన్ సమస్యలు వస్తున్నాయి. లంగ్స్‌లో, హార్ట్ అటాక్, రక్త నాళాల సమస్య, రక్తం గుండెకు సరఫరా కాకా గుండె జబ్బులు వస్తున్నాయని డాక్టర్ సతీష్ అంటున్నారు. చిన్నారుల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలలో కూడా ఈ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.

కరోనా వచ్చి పోయిన వారిలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అత్యధికంగా వస్తున్నాయంటున్నారు. కరోనా వచ్చి పోయిన వారిలో ఇమ్యూనిటీ సిస్టం బాగా పాడయ్యి త్వరగా సిక్‌ అవుతున్నారు. చాలా మంది కరోనా వచ్చి పోతుందని హెల్తీ ఫుడ్ తినడం మానేస్తున్నారు. రికవరీ అయిన వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

కరోనా వచ్చి పోయిన వారిలో అనేక జబ్బుల బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వారియర్స్ రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేయించుకోవాలంటున్నారు. మాస్క్, భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories