Coronavirus: నిజామాబాద్ జిల్లాపై కరోనా పంజా

Corona Effect on Nizamabad District
x

కరోన (ఫైల్ ఫోటో)

Highlights

Coronavirus: 20 రోజుల్లో 1000 మందికి వైరస్ * పెళ్లిలో పాల్గొన్న 86 మందికి పాజిటివ్

Coronavirus: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 20 రోజుల వ్యవధిలో జిల్లాలో 1000 మందికి వైరస్ సోకింది. షాపింగ్ మాళ్లు హాట్ స్పాట్లు గా మారుతుండగా.. ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న 86 మందికి పాజిటివ్ నిర్దారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లా ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు సన్నాహలు చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం జనం ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ కరోనా ఉద్ధృతి పెరిగింది. ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో 1000 మందికి వైరస్ సోకింది.

ప్రజలు కరోనా రూల్స్ పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. నిజామాబాద్ లోని పలు షాపింగ్ మాళ్లు హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. రెండు షాపింగ్ మాళ్లలో 90 మంది సిబ్బంది కరోనా సోకింది. వర్ని మండలం సిద్దాపూర్ లో ఓ వివాహానికి హాజరైన సుమారు 86 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించింది.

నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగులు బయటకు రాకుండా అధికారులను సూచించారు. క్వారంటైన్ కేంద్రాలను తెరవాలని ఆదేశించారు. మాస్క్ లు ధరించకపోతే జరిమానాలు విధించాలని కోరారు.

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టీకాల కోసం ఆసుపత్రికి జనం క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్ ల టార్గెట్ రోజుకు రెండు వందలు కాగా.. 500 మందికి పైగా వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో 10 ప్రైవేట్ ఆసుపత్రులకు టీకా వేసేందుకు సర్కారు అనుమతినిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories