Telangana: రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in Telangana | Telugu News
x

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Telangana: బూస్టర్ డోస్‌ ఇవ్వాలంటూ పలువురు డిమాండ్‌

Telangana: దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 19వేలకు పైగా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి తట్టుకోవడానికి కరోనా టీకా మూడో డోస్ ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనం క్యూ కడుతున్నారు. అదనపు డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అదనపు డోసు ఇవ్వకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలను భారీగా పెంచుతున్నారు.

తెలంగాణలో టీకా ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ రెండు డోసులను విజయవంతంగా పంపిణీ చేసింది. ప్రస్తుతం 12 ఏళ్ల పైబడిన చిన్నారులకు టీకాను ఇస్తోంది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పలువురు బూస్టర్‌ డోస్‌ కోసం యత్నిస్తున్నారు. అయితే బూస్టర్‌ డోస్‌ మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుతప్రుల్లో టీకా ధరను భారీగా పెంచేశాయి. ప్రజల్లో వస్తున్న డిమాండ్‌ను ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి.

కరోనా కేసులు పెరుగుతుండడంతోనే ప్రజల్లో భయం మొదలైనట్టు వైద్యులు చెబుతున్నారు. అందుకే బూస్టర్ డోస్‌ టీకా కోసం ఎగబడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం రెండు డోసులను ఇచ్చిందని బూస్టర్‌ దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్‌ రామ్‌ సింగ్‌ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సర్కారు దవాఖానాల్లో టీకాను అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. బూస్టర్ డోస్‌ తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుందని కూడా డాక్టర్‌ రామ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ను ఇంకా ప్రారంభించలేదని భయంతోనే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్టు రామ్‌సింగ్‌ వివరించారు. ప్రజల నుంచి డిమాండ్లు పెరగడంతోనే ధరలను ప్రైవేటు ఆసుపత్రులు పెంచాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories