తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల చిచ్చు.. మరో కీలక నేత రాజీనామా..

* సీనియర్ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్‌ రాజీనామా

R Tripura Malini
Updated on: 12 Dec 2022 1:32 PM IST
Controversy Over The New PCC Committee
X

తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల చిచ్చు.. మరో కీలక నేత రాజీనామా..

Bellaiah Naik: పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. పీసీసీ కమిటీపై అసంతృప్తితో నిన్న మాజీమంత్రి కొండా సురేఖ TPCC ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఇది మరువకముందే మరో నేత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పంపారు. కొత్త కమిటీల్లో తనకు చోటివ్వలేదని మండిపడుతున్నారు బెల్లయ్య నాయక్‌.

జాతీయ ఆదివాసీ కాంగ్రెస్‌ సెల్‌ వైస్‌ఛైర్మన్‌గా ఉన్న తనకు పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో ఎందుకు స్థానం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ సెక్రెటరీ స్థాయి పోస్ట్‌లో వున్న తనకు పీసీసీ కమిటీ లేదా, ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటివ్వరా అంటూ నిలదీశారు. ఎస్టీ సామాజిక వర్గ నేతలపై పార్టీలో చిన్నచూపు ఉందని ఆరోపిస్తున్నారు బెల్లయ్యనాయక్‌.

R Tripura Malini

R Tripura Malini

Next Story