Top
logo

Mahabubabad: మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీల వివాదం

Controversy about MP Kavitha Flexis in Mahabubabad
X

మహబూబాబద్‌ టీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీల వివాదం(ఫైల్ ఫోటో)

Highlights

*దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ కవిత ఫ్లెక్సీ ఏర్పాటు *ఫ్లెక్సీలను చించేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు

Mahabubabad: మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌లో ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ కవిత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు చింపివేశారు. దీంతో ఎంపీ కవిత అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎండీ ఫరీద్‌తో పాటు మరో 9మందిపై కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో 8 పరారీలో మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అనుచరులను విడిచిపెట్టాలంటూ మహబూబాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం ఇద్దరిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.


Web TitleControversy about MP Kavitha Flexis in Mahabubabad
Next Story