
కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అన్నిటిని పసి పిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ తీసుకునే పౌష్టికాహార పదార్థాలు అన్నీ కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ పాలు విక్రయిస్తున్న వార్తాలు కలకలం రెపుతున్నాయి.
కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ తీసుకునే పౌష్టికాహార పదార్థాలు అన్నీ కల్తీ చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో ప్లాస్టిక్ పాలు విక్రయిస్తున్న వార్తాలు కలకలం రేపుతున్నాయి. గతంలో ప్లాస్టిక్ బియ్యం రెండు రాష్ట్రాల ప్రజలను టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మనం రోజు కాఫీ,టీ పేరుగు వంటివి తయారికీ పాలు చాలా కీలకం అయితే వాటినే ప్లాస్టిక్ పాలు రూపంలో అమ్ముతున్నారన్న వార్తలు ప్రజలను ఆందోళన కలిస్తుంది.
ప్లాస్టిక్ పాలు చూడడానికి మూమూలుగానే ఉంటాయి. కానీ వాటిని వేడిచేస్తేనే నిజస్వరూపం తెలుస్తోంది. కుకట్ పల్లిలోని ప్రగతినగర్‌లో నివసించే పవన్, సౌమ్య దంపతులు శుక్రవారం స్థానిక విల్క్ సెంటర్లో లీటరు పాలు కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకొచ్చి కాగబెట్టగా పాలు ముద్దలా మారిపోయాయి. దీంతో అనుమానం వచ్చిన వారు యజమానిని అడగగా బెదించాడని తెలిపారు. కాగా.. బాధితులు బాచుపల్లి పోలీస్‌స్టేషలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే కారణంతో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నారని ఇందేంటని ఆడగగా బెదింపులకు దిగారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




