విజయశాంతి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారు : కుసుమ కుమార్

X
Highlights
కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి విజయశాంతి చేరుతుందన్న ఊహాగానాల నేపధ్యంలో ఆమెతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ భేటీ అయ్యారు
admin28 Oct 2020 2:45 PM GMT
కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి విజయశాంతి చేరుతుందన్న ఊహాగానాల నేపధ్యంలో ఆమెతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ భేటీ అయ్యారు. ఆమెతో భేటీ అనంతరం కుసుమ కుమార్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని, విజయశాంతి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీతో చర్చల ప్రస్తావన కూడా విజయశాంతితో రాలేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని గౌరవంగానే చూస్తోందని అన్నారు. పీసీసీ కూడా ఎన్నికల ప్రచారం కోసం రమ్మని అడిగారని అయితే ఆమె కోవిడ్ వల్ల రాలేనని చెప్పారని తెలిపారు.
Web TitleCongress Working President Jetty Kusuma Kumar meet Vijayashanthi
Next Story