కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం.. రేవంత్ నాయకత్వంపై అసంతృప్తి...

Congress Senior Leaders Who is Against Revanth Reddy Meeting Today 20 03 2022
x

కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం.. రేవంత్ నాయకత్వంపై అసంతృప్తి...

Highlights

Congress: జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, గీతారెడ్డిలతో పాటు పలువురికి ఆహ్వానాలు...

Congress: తెలంగాణలో పార్టీ అసమ్మతి రాగాలు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. తక్షణమే సమావేశమై కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ సీనియర్‌ నేతలు భేటీ కావాలని నిర్ణయించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు మాత్రమే సమావేశమవుతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికెళ్లి మరీ, పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆహ్వానించారు. అలాగే, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపారు. గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు రహాస్య భేటీలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సమయం దొరికిన ప్రతిసారి ఆయనపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్కం ఠాకూర్ వైఖరిపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా సీనియర్‌‌లకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. పార్టీ నష్టపోయేలా సీనియర్‌ల ప్రవర్తన ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌లు కార్యకర్తల శ్రేయస్సును ఆలోచించాలన్నారు. పార్టీలో అన్ని అనుభవించిన వారు అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. పార్టీకి నష్టం చేసేవారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని.. బీజేపీ, టీఆర్ఎస్‌లకు లాభం చేకూరేలా కొందరు ప్రవర్తించేవారిని అదుపు చేయాలన్నారు మల్లు రవి.

Show Full Article
Print Article
Next Story
More Stories