TS Congress: రంగంలోకి సోనియా.. తెలంగాణపై సెంటిమెంట్ అస్త్రం..

Congress Plan For Consecutive Meetings In Telangana
x

TS Congress: రంగంలోకి సోనియా.. తెలంగాణపై సెంటిమెంట్ అస్త్రం..

Highlights

TS Congress: సెప్టెంబర్ 17న తెలంగాణలో సోనియాగాంధీ బహిరంగ సభ

TS Congress: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆపరేషన్ తెలంగాణకు కాంగ్రెస్ తెరలేపింది. వరుస సభలు,సమావేశాలు నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించింది. కేడర్‌లో జోష్ పెంచేలా కార్యచరణ రూపొందిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 17న తెలంగాణలో సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజు మేనిఫెస్టోతో పాటుగా సెంటిమెట్ అస్త్రాలను సంధించేందుకు సిద్దమవుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఈ నెల 18న హైదరాబాద్‌లో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఇటు సెప్టెంబర్ మొదటి వారంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో సూర్యాపేటలో బీసీ గర్జన సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. సిద్దరామయ్యతో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేందుకు కార్యచరణ రూపొందించాయి. సెప్టెంబర్‌లో తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించన్నారు. ప్రియాంకగాంధీతో బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories