వలస కార్మికులకు న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు సిద్ధం : విహెచ్

వలస కార్మికులకు న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు సిద్ధం : విహెచ్
x
Congress Senior Leader Hanumanth Rao (File Photo)
Highlights

వలస కార్మికుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా వైఫల్యం చెందారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆరోపించారు.

వలస కార్మికుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా వైఫల్యం చెందారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ కేవలం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకే పరిమితం అవుతున్నారని విహెచ్ విమర్శించారు. వలస కార్మికులకు న్యాయం జరగకపోతే తాను ఆమరణ దీక్షకు దిగనున్నట్లు హెచ్చరించారు.

దేశ విభజన సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఉదయం నుంచి నిరసన దీక్ష నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ చేత ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీహెచ్‌ను అరెస్ట్‌ చేసి విహెచ్ పెట్టిన కేసులు అత్యంత దారుణంగా ఉన్నాయని దుయ్యబట్టారు. వలస కూలీల సమస్యపై ఆందోళనలు, నిరసనలు చేసిన వీహెచ్‌ను అభినందనిస్తున్నట్లు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories