మోడీ ఒళ్లో కూర్చొని రైతు ద్రోహిగా మిగిలిపోయారు..కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

మోడీ ఒళ్లో కూర్చొని రైతు ద్రోహిగా మిగిలిపోయారు..కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
x

రేవంత్ రెడ్డి ఫైల్ ఫోటో 

Highlights

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రాజీవ్ రైతు భరోసా దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నేతలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ పై తీవ్రంగా విమర్శించారు. రైతులను పట్టించుకోకుండా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మోసం చేసారని మండి పడ్డారు. ఢిల్లీ పోరాటాన్ని పసుపు రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి చలో ఢిల్లీ ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ఒళ్లో కూర్చొని రైతు ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు బహిష్కరిస్తే.. కేసీఆర్ మాత్రం అనుకూలంగా వ్యవహరించారని మండి పడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకే కాంగ్రెస్ పోరాటం కొనసాగుతోందని రేవంత్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories