logo
తెలంగాణ

Jeevan Reddy: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

Congress MLC Jeevan Reddys Letter to CM KCR | TS News Today
X

Jeevan Reddy: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

Highlights

Jeevan Reddy: ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనాలి

Jeevan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రైతులకు విత్తన రాయితీ, వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యానవన పంటలకు రాయితీలు అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరి వేస్తే ఉరి అని రైతులను నిరుత్సాహ పరిచిన తాను 150 ఎకరాల్లో వరి సాగు చేయడం సీఎం ద్వంద్వ విధానానికి నిదర్శమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వరి సాగు ఆగిపోయిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల చొప్పున మొత్తం 15వందల కోట్లు నష్టపరిహారం కేటాయించాలన్నారు జీవన్ రెడ్డి.

Web TitleCongress MLC Jeevan Reddy's Letter to CM KCR | TS News Today
Next Story