Top
logo

మంత్రి హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ భేటీ...కారెక్కుతారని జోరుగా సాగుతున్న ప్రచారం

మంత్రి హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ భేటీ...కారెక్కుతారని జోరుగా సాగుతున్న ప్రచారం
X
Highlights

తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు....

తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో ఎమ్మెల్యే కోమటిరెడ్డి సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కమలదళంలో చేరుతారని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్‌గా ఈ అంశంపై యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్టు ప్రకటించి పార్టీ మార్పు అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి హరీశ్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.మంత్రి హరీశ్‌తో భేటీ కావడంతో కోమటిరెడ్డి కారుక్కుతారనే పుకార్లు వస్తున్నాయి.

Next Story