Top
logo

తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌

తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌
X
Highlights

రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం రికార్డుల్లో చూపడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం రికార్డుల్లో చూపడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

Web TitleCongress MLA Jaggareddy Fire on Telangana Government
Next Story