సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

Congress MLA Jagga Reddy Fires on SangareddyDistrict collecter
x

MLA Jaggareddy (file Image)

Highlights

* కంది (మం) చేర్యాల గ్రామంలో పేదల ఇల్లు కూల్చేసిన అధికారులు * కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం

సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్ లను పార్టీ మారమని స్వయంగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా కంది మండలం చేర్యాల గ్రామంలో పేదల ఇల్లు కూల్చివేతపై కలెక్టర్ హనుమంత రావుపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో ఏ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పట్టుబట్టి మరీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు జగ్గారెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఇళ్లు షెడ్లు కూల్చేస్తున్నారు.. ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా సమయం ఇవ్వమని ప్రాధేయపడిన కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories