తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదం..ఇవాళ సంచలన ప్రకటన చేస్తానన్న జగ్గారెడ్డి

Congress MLA Jagga Reddy Fire on TPCC Chief Revanth Reddy
x

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదం.. ఇవాళ సంచలన ప్రకటన చేస్తానన్న జగ్గారెడ్డి

Highlights

*రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి నిప్పులు

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం మళ్లీ చిగురించింది. జగ్గారెడ్డి- రేవంత్‌రెడ్డి మధ్య హీట్‌ పెరుగుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. సొంత కుంపటిలోనే ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇవాళ సంచలన విషయాలు వెల్లడిస్తా అంటూ జగ్గారెడ్డి ప్రకటించారు. జగ్గారెడ్డి ఏం చెబుతారో అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్ తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసింది.

సిన్హా టూర్ ను టీఆర్‌ఎస్‌ పార్టీ హైజాక్ చేయడంతో ఆయన్ను కాంగ్రెస్ నేతలెవరూ కలవద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలను పట్టించుకోకుండా ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ సిన్హాను కలిశారు. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ నౌకర్లు ఎవరూ లేరని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరుతో తాను విసిగిపోయానని రాహుల్‌కి ఇచ్చిన మాట తప్పానన్న ఆవేదనలో ఉన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories