Bandi Sanjay: కాంగ్రెస్ మేనిఫెస్టోలేని అంశాలు అమలు చేయడం లేదు

Congress Manifesto is not being implemented Says Bandi Sanjay
x

Bandi Sanjay: కాంగ్రెస్ మేనిఫెస్టోలేని అంశాలు అమలు చేయడం లేదు

Highlights

Bandi Sanjay: నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతోనే... కాంగ్రెస్‌కి పదవులు వచ్చాయి

Bandi Sanjay: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారితే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని... కానీ వారే దానిని అమలు చేయడం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా బండి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ అంటోందని.... అదే వాస్తవమైతే ఆ స్థానాలన్నింటికీ బై ఎలక్షన్ జరగాలని డిమాండ్ చేశారు. అలా జరిగితే ఆ స్థానాలన్నీ బీజేపీ గెలుచి... ప్రధాన ప్రతిపక్ష హోదా తమకు వస్తోందన్నారు. నిరుద్యోగులకు BRS ఉద్యోగాలు ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్‌కి పదవులు వచ్చాయన్నారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ మంత్రుల ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారాయన. రాబోయే GHMC ఎన్నికల్లో BJP, MIM మధ్యే పోటీ ఉంటుందన్నారు. అసదుద్దీన్ గోడ మీద కూర్చుంటాడని... ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో కుమ్మక్కు అవుతాడని బండి సంజయ్ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories