Top
logo

హుజూర్‎నగర్‎లో కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్‎కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలి

హుజూర్‎నగర్‎లో కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్‎కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలి
Highlights

టీఆర్ఎస్ హుజూర్‎నగర్ ఇన్‎చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్‎కుమార్ రెడ్డి కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు.

హుజూర్‎నగర్ ఉపఎన్నిక దగ్గర పడుతున్నకొద్దీ రోజురోజుకు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. హుజూర్‎నగర్ ఉపఎన్నిక గెలుపుపై ఎవరికీ వారు ధీమాగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతీ అంశంలోను వ్యూహాలు పదునుపెడుతున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ హుజూర్‎నగర్ ఇన్‎చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్‎కుమార్ రెడ్డి కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. ఉత్తమ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆంధ్రా వ్యక్తి కాదని, తెలంగాణ వ్యక్తే అని స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఉత్తమ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. హుజూర్‎నగర్‎లో టీఆర్ఎస్ 40వేల మెజార్టీతో విజయం సాధిస్తారని రాజేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు.

Next Story