ఇవాళ మునుగోడులో పర్యటించనున్న కాంగ్రెస్ ముఖ్యనేతలు

Congress Leaders  Will Visit Munugode Today
x

ఇవాళ మునుగోడులో పర్యటించనున్న కాంగ్రెస్ ముఖ్యనేతలు

Highlights

Munugode: రాజ్‌గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్‌ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జీషీట్‌ విడుదల

Munugode: తెలంగాణ రాజకీయాలు మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. మునుగోడును దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్యనేతలు మునుగోడులో పర్యటించనున్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్‌ వైఫల్యాలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చార్జీషీటు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడులోని పీఆర్‌ఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుపై నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకాగాంధీతో భేటీ తర్వాత కూడా మునుగోడు ప్రచారానికి ఆసక్తి చూపించలేదు. ఢిల్లీ వెళ్లిన వెంకట్‌రెడ్డి..రేపు రాంలీలా మైదానంనలో జరిగే నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories