Top
logo

ఏటూరునాగారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

ఏటూరునాగారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
X
Highlights

మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసన గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ధర్నా, రాస్తోరోకో నిర్వహించారు.

ఏటూరునాగారం: మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసన గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ధర్నా, రాస్తోరోకో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రము లో నిజాం నిరంకుశ పాలన సాగిస్తూ ప్రశ్నించే గొంతుక లేకుండా అక్రమ అరెస్ట్ లు చేసి, ప్రతిపక్షం లేకుండా చేస్తున్న ఈ తెరాస ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమములో మండల అధ్యక్షులు చిటమట రఘు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్, జడ్పీటీసీ కరం చంద్ గాంధీ, కోప్షన్ సభ్యులు అప్సర్, జిల్లా నాయకులూ ఇర్సవడ్ల వెంకన్న, కార్ల అరుణ, వావిలాల నర్సింగ రావు, వావిలాల చిన్న ఎల్లయ్య నాగరాజు, ముక్కెర లాలయ్య, హన్మంత్, నరేందర్ మదారి రామయ్య, ఖలీల్ ఖాన్, నాగరాజు, విజయ్, రవి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


Web TitleCongress Leaders Rastaroko in Eturnagaram against revanth reddy arrest
Next Story