ఇవాళ గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ

Congress Leaders Meeting at Gandhi Bhavan Today
x

ఇవాళ గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ 

Highlights

*హాజరుకానున్న ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు

Congress: మునుగోడులో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన ఏఐసీసీ నియోజకవర్గంలో అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో ఇవాళ గాంధీ భవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

మునుగోడు కాంగ్రెస్ టికెట్‌పై నలుగురు ఆశలు పెట్టుకున్నారు. చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్న కైలాష్ నేత, పల్లె రవితో పాటు పాల్వాయి స్రవంతి మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఈమేరకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ , ఏఐసీసీ సెక్రటరీలు ఆశావహులతో గాంధీభవన్‌లో గతంలో భేటీ అయ్యారు. మునుగోడు టికెట్ ఎవరికి ఇచ్చినా అంతా కలిసి పని చేయాలని చెప్పారు.

కాంగ్రెస్ ముఖ్యనేలతో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం కోసం అధిష్టానికి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా అందించారు. అయితే ఏఐసీసీ పాల్వాయి స్రవంతికి మునుగోడు టికెట్ ఖరారు చేయడంతో మిగతా నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించేందుకు ఇవాళ గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. పాల్వాయి స్రవంతి గెలుపు కోసం అంతా కలిసి పని చేయాలని నేతలకు సూచించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories