పుకార్లపై రఘువీర్‎ రెడ్డి క్లారిటీ!

పుకార్లపై రఘువీర్‎ రెడ్డి క్లారిటీ!
x
Highlights

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇదే ఊపులో అసెంబ్లీ నాటికి పార్టీ పునాదులను పఠిష్టం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇదే ఊపులో అసెంబ్లీ నాటికి పార్టీ పునాదులను పఠిష్టం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో నాగర్జునసాగర్ ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. దుబ్బాకలో గెలుపు, గ్రేటర్‎లో సత్తా చాటిన బీజేపీ నాగార్జునసాగర్‎లో గెలవడం ద్వారా మరోసారి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది.

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బీజేపీ తరఫున బరిలో దించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తుందనే వార్తలు ఒక్కసారిగా సంచలనం కలిగిస్తున్నాయి. గత కొంత కాలంగా రాజకీయంగా, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జానారెడ్డి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా తిరిగి క్రియాశీలం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. నాగార్జునసాగర్ పై రాజకీయంగా జానారెడ్డికి ఎనలేని పట్టుంది. దీంతో జానారెడ్డి కుమారుడు రఘువీర్ ను బరిలోకి దింపడం ద్వారా సాగర్‌లో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై జానారెడ్డి కుమారుడు రఘువీర్ క్లారిటీ ఇచ్చారు. నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన రఘువీర్.. కనీసం ఆయన సంతాప దినాలు అయ్యేంతవరకైనా రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన రోజు నుంచే సోషల్ మీడియాలో విష రాజకీయాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. దయచేసి ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దన్న రఘువీర్.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. జానారెడ్డి తనయుడిగా విలువలతో కూడిన రాజకీయాలే చేస్తానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories