Lagadapati Rajagopal: మళ్లీ లగడపాటి రాజగోపాల్ ఎంట్రీ

Lagadapati Rajagopal: విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసే యోచనలో లగడపాటి

Rama Rao
Updated on: 24 April 2022 1:58 PM IST
Congress Leader Lagadapati Rajagopal is Going to Make a Political Entry Once Again
X

Lagadapati Rajagopal: మళ్లీ లగడపాటి రాజగోపాల్ ఎంట్రీ 

Lagadapati Rajagopal: కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మైలవరం ఎమ్మెల్యే, నందిగామ, కంచికర్ల వైసీపీ నేతలతో లగడపాటి రాజగోపాల్ సమావేశం అయ్యారు. లగడపాటిని కలిసిన వారిలో కంచికచర్ల వైసీపీ నేతలు వేల్పుల రమేష్, కాలువ పెదబాబు, నందిగామకు చెందిన న్యాయవాది కన్నెగంటి జీవరత్నం ఉన్నారు. విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లగడపాటి ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక నేతలతో చర్చించినట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story