Congress: అభ్యర్ధుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్

Congress Is Focusing On The Selection Of Candidates
x

Congress: అభ్యర్ధుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్

Highlights

Congress: CWC సమావేశాల ఏర్పాట్లపై టీపీసీసీ నేతలతో సమీక్ష చేయనున్న కేసీ 

Congress: అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై చర్చ జరుగుతుండటంతో... పార్లమెంట్ సమావేశాల వరకు వేచి చూడాలని పీఈసీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో... తెలంగాణలో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ లోపు నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల పేర్లను... హైకమాండ్‌‌కు పంపాలని పీఈసీ భావిస్తోంది.

మరో వైపు ఈ నెల 17న AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 16,17,18 తేదీల్లో హైదరాబాద్‌లో CWC సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... CWC సమావేశాల ఏర్పాట్లపై టీపీసీసీ నేతలతో కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories