Congress: 36 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ను ప్రకటించిన హస్తం అధిష్టానం..కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress Has Announced The Names of Four Candidates From Telangana
x

Congress: 36 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ను ప్రకటించిన హస్తం అధిష్టానం..కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Highlights

Congress: తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటన

Congress: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 39 మంది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. తొలి జాబితాలో 15 మంది జనరల్, 24 మంది ఇతదర కేటగిరికి చెందిన వారు ఉన్నట్లు ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నల్లగొండ నుంచి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరామ్‌నాయక్ పేర్లను తొలిజాబితాలో ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఆచితూచి ప్రకటిస్తోంది. అన్ని చోట్ల గెలుపు గుర్రాలనే బరిలోకి నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో 13 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలుపొందాలని ఆ పార్టీ టార్గెట్ గా నిర్ణయించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుపొందలేకపోయింది. అధిష్టానం హైదరాబాద్ పై దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

రాష్ట్రాల వారీగా పరిశీలించినట్లయితే కేరళ నుంచి అత్యధికంగా 16 మంది అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రకటించింది. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అలపు్పజ నుంచి కేసీ వేణుగోపాల్, తిరువనంతపురం నుంచి శశిథరూర్ పోటీ చేస్తున్నారు. ఇక కర్ణాటకలో ఏడుగురు అభ్యర్ధులను ప్రకటించారు. వీరిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు.

చత్తీస్ గఢ్ నుంచి ఆరుగురు అభ్యర్ధులను ప్రకటింటారు. లక్ష ద్వీప్ నియోజకవర్గ వర్గం నుంచి మహ్మద్ హమ్ దుల్లా సహిద్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. మేఘాలయ నుంచి ఇద్దరి పేర్లను అనౌన్స్ చేశారు. తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి సాలెంగ్ ఎ. సంగ్మ పోటీ చేయనున్నారు. నాగాలాండ్ లోక్ సభ స్థానం నుంచి సుపోంగమెరన్ జమీర్, సిక్కిం నుంచి గోపాల్ ఛెత్రి, త్రిపుర వెస్ట్ నుంచి ఆశీష్ కుమారా సాహూ పోటీ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories