Congress: క్యాంప్ పాలిటిక్స్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌

Congress Focus on Camp Politics
x

Congress: క్యాంప్ పాలిటిక్స్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌

Highlights

Congress: కర్ణాటక క్యాంపులకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు...?

Congress: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరో రెండు రోజుల్లో సీఎం పీఠం దక్కించుకునేది ఎవరనేది తేలనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థలన్నీ కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని తేల్చడంతో.. హస్తం హైకమాండ్‌ ఇప్పుడు క్యాంప్‌ పాలిటిక్స్‌పై ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు వచ్చినా.. స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ వచ్చినా.. ఆ అవకాశాన్ని వదులుకోవద్దనే భావనతో ముందస్తు చర్యలు చేపడుతోంది. గత అనుభవాల దృష్ట్యా తమ ఎమ్మెల్యేలు ఎవరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కర్ణాటక కేంద్రంగా క్యాంప్ పాలిటిక్స్‌కు తెరతీసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో 70కి పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌.. ఒక వేళ హంగ్‌ వస్తే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనా దృష్టి పెట్టింది. గెలిచేందుకు ఆస్కారం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఇవాళ లేదా కౌంటింగ్ రోజు వారిని తరలించే అంశంపై మంతనాలు జరుపుతోంది కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున.. అక్కడైతే సేఫ్ అని కాంగ్రెస్‌ భావిస్తోంది. క్యాంపులకు ఎమ్మెల్యేలను తరలించేందుకు ఇప్పటికే ఫైవ్ స్టార్ హోటల్స్‌, రిసార్టులను బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్యాంపు ఆపరేషన్‌ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నేతృత్వంలో నడుస్తున్నట్లు సమాచారం.

2014 ఎన్నికల తర్వాత టీడీఎల్పీని, కాంగ్రెస్‌, సీపీఐల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి 12 మంది, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. హంగ్‌ వస్తే కేసీఆర్‌ తన మార్కు రాజకీయాన్ని తెరపైకి తెచ్చే చాన్స్‌ ఉందని.. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories