Asifabad: కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం

Confusion In Selection Of Constable Candidates In Asifabad
x

Asifabad: కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం

Highlights

Asifabad: నేడు ఉన్నతాధికారులను కలవనున్న కానిస్టేబుల్‌ అభ్యర్థులు

Asifabad: కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మూతపడిన స్కూల్‌ సర్టిఫికెట్‌తో మరో జిల్లాలో అభ్యర్థులు ఉద్యోగం పొందారు. ఈ ఘటన కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌ ఎంపికలో అనేక అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాలకు చెందిన అభ్యర్థి కొమరంభీం ఆసిఫాబాద్‌లో మూతబడిన స్కూల్‌ నుండి స్టడీ సర్టిఫికెట్‌తో కానిస్టేబుల్‌ ఉద్యోగం పొందాడు. దీంతో ఒక్క మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి స్థానికత విషయంపై అధికారులు చొరవ తీసుకోవాలని కానిస్టేబుల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సదరు అభ్యర్థి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. దీనిపై నేడు కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఉన్నతాధికారులు కలవనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories