Shamshabad: శంషాబాద్ రోడ్డుపై స్థానికుల ఆందోళన.. భారీ ట్రాఫిక్ జామ్

Concerns of Locals On Shamshabad Road
x

Shamshabad: శంషాబాద్ రోడ్డుపై స్థానికుల ఆందోళన.. భారీ ట్రాఫిక్ జామ్

Highlights

Shamshabad: పోలీసులతో స్థానికుల వాగ్వాదం, లాఠీచార్జ్‌

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై సిద్ధాంతి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వరుస రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. యాదయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొని చనిపోయాడు. దీంతో గ్రామస్తులు యాదయ్య డెడ్‌బాడీతో రోడ్డుపై బైఠాయించారు. వాహనాలు వేగంగా వెళ్తూ తమ ప్రాణాలను బలిగొంటున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో శంషాబాద్ నుంచి గగన్‌పహాడ్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికులను రహదారిపై నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు గ్రామస్తులపై లాఠీఛార్జ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories