Kamareddy: మరింత ఉధృతంగా మారిన కామారెడ్డి రైతుల ఆందోళనలు

Concerns of Kamareddy Farmers
x

Kamareddy: మరింత ఉధృతంగా మారిన కామారెడ్డి రైతుల ఆందోళనలు 

Highlights

Kamareddy: నేటి నుంచి మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్న రైతులు

Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా దశలోనే ఉందని..అందరి రైతులకు న్యాయం చేస్తామని సర్కారు అంటుంటే..ప్లాన్‌ను రద్దు చేయాల్సిందే అంటూ రైతులు పట్టుబడుతున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేవరకు తగ్గేదేలే అంటు రైతులు భీష్మించుకొని కూర్చుంటున్నారు. తమ ప్రాణాలను తెగించైనా తమ భూముల్ని కాపాడుకుంటామని తెగేసి చెప్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో తన భూమి పోతుందనే ఆవేదనతో రాములు అనే రైతు ఇటివలే ఆత్మహత్య చేసుకోవ‌డంతో మొద‌లైన ఈ రగడ..తీవ్ర ఆందోళ‌న‌లకు దారి తీసింది. రైతులతో మొద‌లైన ఉద్యమం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కుర్చీలను కదిలిస్తోంది. వివాదంపై నిన్న ఆదివారం రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8 గ్రామాల రైతులు సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు కోరుతూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

పార్టీలకు అతీతంగా కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న 49 మంది కౌన్సిలర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. రేపు ఆందోళనకు విరామం ప్రకటించిన రైతులు, 11న మున్సిపల్ కార్యాలయం దగ్గర వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని నిర్ణయించారు. పంట పొలాల్లో ఇండస్ట్రియల్ జోన్ విషయంలో మున్సిపల్ తీర్మానం చేసి రైతులకు అండగా నిలవాలని లేనిపక్షంలో మరోసారి రైతుల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వారం రోజుల క్రితం సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ప‌య్యావుల రాములు ఆత్మహత్య చేసుకోవ‌డంతో ఈ ఉద్యమం మరింత ఉదృతం అయింది. భూమి కోల్పోతున్నామని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అయితే ముసాయిదా తయారీలో ప్రజాప్రతినిధులు జోక్యంతోనే త‌యారు చేశారని రైతులు నిర‌స‌న ప్రదర్శనకు దిగారు. ముసాయిదా స్పష్టంగా లేదని రైతులు పైర్ అయ్యారు. రాములు మృతితో తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు..కామ‌రెడ్డిలో భారి ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనలకు విపక్షాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో రైతులు మరింత ఉదృతంగా ఆందోళనలను నిర్వహించారు. 8 విలీన గ్రామాలకు చెందిన సుమారు 2వేల మంది రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ వివాదంపై స్పందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే గంపా గోవర్థన్‌ రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని క్లారిటీ ఇచ్చారు. అయినా రైతులు మాత్రం తమ ఆందోళనలను కంటిన్యూ చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు చేసి 49 మంది కౌన్సిలర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఈనెల 11న శాంతియుతంగా మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories