భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలం : కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి

భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలం : కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి
x
Highlights

భౌతికంగా తమకు దూరమైనా ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి ఉండదని, మేము మరణించేంత వరకు ఆయన చూపిన బాటలోనే పయనిస్తామని, పిల్లలను సైతం...

భౌతికంగా తమకు దూరమైనా ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి ఉండదని, మేము మరణించేంత వరకు ఆయన చూపిన బాటలోనే పయనిస్తామని, పిల్లలను సైతం అదే స్ఫూర్తితో పెంచుతానని చెప్పుకొస్తున్నారు వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ భార్య సంతోషి. తను విధుల్లో ఉన్నప్పుడు ఎంత సీరియస్ గా ఉండేవారో.. ఇంటికొస్తే చిన్న పిల్లాడిలా పిల్లలతో ఆడుకునేవారిని జ్ఞాపకం చేసుకున్నారు. మా ప్రాణం ఉన్నంత వరకు ఆయన ధ్యాసలోనే జీవనం సాగుతుందని చెప్పారు ఆమె.

క్లిష్టపరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండటం అనేది వీర సైనికుడైన భర్త నుంచే అబ్బిందేమో ఆమెకు! ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి.. సరిహద్దులో పోరాడుతూ భర్త వీరమరణం పొందాడని చెప్పినప్పుడు ఆమె లోలోపలే కుమిలిపోయారు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకున్నారు. అత్తామామల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి చెప్పకుండా గొప్ప నిబ్బరాన్ని ప్రదర్శించారు. ఆమే.. దేశసేవలో అమరుడైన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు భార్య సంతోషి. భర్త భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు తనకెప్పుడూ పదిలంగానే ఉంటాయని సంతోషి చెప్పారు. దేశం కోసం ఆయన తన ప్రాణాలను అర్పించడం గర్వంగా ఉందని, ఆయన స్ఫూర్తితోనే తమ ఇద్దరు పిల్లలను పెంచుతానని, తండ్రి సాహసాన్ని వారికి నూరిపోస్తానని ఉద్వేగంగా చెప్పారు. ప్రభుత్వాలు.. మాటల్లో కాకుండా సరైన నిర్ణయాలు తీసుకొని చైనాను నియంత్రించాలని అన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ నిర్ణయం కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు.

2004లో ఆయన సైన్యంలో లెప్టినెంట్‌ హోదాలో చే రారు. ఆ తర్వాత కెప్టెన్‌, మేజర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌, కల్నల్‌ స్థాయికి చేరుకున్నారు. చిన్న వయసులోనే కల్నల్‌ స్థాయికి ఎదిగారు. ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. సైన్యంలో ఎన్నో ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జమ్మూ, శ్రీనగర్‌ కుప్వారా, పుణె, శ్రీనగర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్‌ బృందం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయలో కూడా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళ సభ్యుడిగా కాంగో వెళ్లి అక్కడ అల్లర్లను అదుపులో కి తీసుకొచ్చారు. అందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రశంసాపత్రాన్ని అందజేసింది. ఆక్రమిత కశ్మీర్‌ సరిహద్దు వద్ద కూడా ముగ్గురు ఐఎ‌సఐ ఉగ్రవాదుల ను మట్టుపెట్టారు. సైన్యంలో ఎంతో ధైర్యసాహసాలు చూపించేవారు. ఇంటికి వచ్చినప్పుడు దేశ రక్షణకు సంబంధించిన విషయాలు చర్చించేవారు కాదు. ఇంటికొస్తే చిన్న పిల్లవాడిలా ఆటలు ఆడుకునేవారు. కుటుంబం అన్నా, బంధువులన్నా ఇష్టపడేవారు.

2009 అక్టోబరులో సంతోషబాబుతో నాకు వివాహమైంది. పెళ్లికి ముందు సైనికులు ఏం చేస్తారో, వారి త్యాగం ఎలాంటిదో నాకు అవగాహన ఉండేది కాదు. వివాహమైన ఆయనతో కలిసి పలు రాష్ట్రాలకు వెళ్లా ను. దీంతో సైనికుల కుటుంబాలతో కూడా సాన్నిహి త్యం ఏర్పడింది. దేశం కోసం నిస్వార్ధంగా వారు చేస్తు న్న సేవలు అజరామరం. ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా విజయంతో తిరిగి వస్తాననేవారు. భర్తను కోల్పోయి వ్యక్తిగతంగా తీవ్ర ఆవేదనలో ఉన్నా.. దేశం కోసం ఆయన ప్రాణాలర్పించడం గర్వంగా ఉంది.

ఈ నెల 16వ తేదీ ఉదయం ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి సంతోష్‌బాబు చనిపోయారని చెప్పారు. అత్తమామలకు చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డా. ఫోన్‌ ఉదయం వచ్చినప్పటికీ మధ్యాహ్నం 2 గంటలకు విషయం చెప్పా. ఫోన్‌లో ఆ మాట వినగానే షాకయ్యాను. అత్తమామల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వెంటనే చెప్పలేకపోయా. ఫోన్‌ వచ్చిన దగ్గరి నుంచి మనసు మనసులో లేదు. వారికి విషయం చెప్పేదాకా నాలో నేనే కుమిలిపోయాను. ఈ నెల 14న లద్ధాఖ్‌ నుంచి ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగారు. కరోనా విషయమై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంతలోనే ఈ ఉపద్రవం వచ్చి పడుతుందని ఊహించలేదు. సంతోష్‌బాబు స్ఫూర్తితోనే పిల్లలను పెంచుతా. సంతోష్‌బాబు తండ్రి ఏ విధంగా కుమారుడిని పెంచారో అదే విధంగా నేను కూడా సంతోష్‌బాబు ధైర్య సాహసాలను తెలియజేసి దేశభక్తిని నూరిపోస్తా.

చైనాకు గట్టి బుద్ధి చెప్పినప్పుడే అమరులైన భారత సైనికుల ఆత్మ శాంతిస్తుంది. జన్మభూమి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది. చైనా వస్తువులను నిషేధించాలి. మాటల్లో కాకుండా ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకొని చైనాను నియంత్రించాలి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం కోసం దేశం ఎదురు చూస్తోంది. బాబు అనిరుధ్‌ తేజకు నాలుగేళ్లే. ఇంకా తండ్రి వస్తాడేమోనని ఎదురుచూస్తున్నాడు.

5కోట్ల నగదు.. నివాస స్థలం : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

కల్నల్‌ సంతోషబాబు కుటుంబానికి రాష్ట్ర ప్ర భుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం తరఫున సంతోషబాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోషబాబు భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. తానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి సా యం అందజేస్తానన్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొ ప్పున సాయాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అం దిస్తామన్నారు. దేశమంతా వారికి అండగా ఉం టుందన్నారు. కాగా, ప్రభుత్వం సహాయం ప్రకటించడంపై సంతోష్‌బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories