వికారాబాద్ జిల్లా దోర్నాల్ గ్రామంలో వింత వ్యాధితో కోళ్లు, కాకులు మృతి

X
ఫైల్ ఇమేజ్
Highlights
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో వింత వ్యాధితో కోళ్లు, కాకులు, మృతిచెందాయి. వింత వ్యాధి...
Sandeep Eggoju13 Feb 2021 10:09 AM GMT
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో వింత వ్యాధితో కోళ్లు, కాకులు, మృతిచెందాయి. వింత వ్యాధి బారినపడిన కోళ్లు, కాకులు గిరగిరా కొట్టుకుని చనిపోతున్నాయి. దీంతో స్థానికులు, కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన డాక్టర్లు దోర్నాల్ లో పర్యటించి పలు శాంపిల్స్ సేకరించారు. అయినా, ఇంత వరకు వింత వ్యాధికి గల కరణాలను చెప్పలేదని స్థానికులు అంటున్నారు.
Web TitleCocks and Crows Died of a Strange Disease in Vikarabad Dornal Village
Next Story