సింగరేణిలో కీలక పాత్ర పోషిస్తున్న కోల్ కట్టర్ డిజిగ్నేషన్

Coal Cutter Design Plays a Key Role in Singareni | TS News
x

సింగరేణిలో కీలక పాత్ర పోషిస్తున్న కోల్ కట్టర్ డిజిగ్నేషన్

Highlights

*కోల్ కట్టర్ పనిని చేయడానికి జంకుతున్న నేటితరం కార్మికులు

Mancherial: సింగరేణి అంటేనే ఒకప్పుడు గుర్తుకు వచ్చేది కోల్ కట్టర్, కోల్ ఫిల్లర్ డిజిగ్నేషన్లే కంపెనీ లోగోలో ఇప్పటికీ వీరి వర్కింగ్ స్టిల్స్ ఉంటాయి. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర వీరిదే కోల్కట్టర్లు డ్రిల్ వేసి బ్లాస్టింగ్ చేస్తే తప్ప బొగ్గు ఉత్పత్తి కాదు. అయితే ఈ డిజిగ్నేషన్ పనిని చేయడానికి నేటితరం కార్మికులు జంకుతున్నారు. కోల్ కట్టర్ ప్రమోషన్ లెటర్ ఇచ్చినా తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. నేటి తరం కార్మికుల వైఖరితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

భూగర్భ గనుల్లో కోల్ కట్టర్ విధులు చాలా కీలకం. వీరిని ఫేస్ వర్కర్ అని కూడా సంబోధిస్తారు. కోల్కట్టర్ తన విధులు నిర్వహించకపోతే ఏ పనులూ జగరవు. కంపెనీలో ఉన్న అన్ని డిసిగ్నేషన్ల కంటే కోల్ కట్టర్ డిజిగ్నేషన్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతో శ్రమకోర్చి పనిచేయాల్సి ఉంటుంది. సుమారు 20కిలోల బరువున్న డ్రిల్ మినన్ ను పట్టుకుని, 6పీట్ల లోతు డ్రిల్ చేయాల్సి ఉంటుంది. కంపెనీలో కారుణ్య ఉద్యోగాల పుణ్యమా అని ఉన్నత చదువులు చదివిన కార్మికుల పిల్లలు ఉద్యోగాల్లో చేరుతున్నారు. వీరిలో 30శాతం కాన్వేంట్ చదువులు, చిన్నప్పటి నుండి ఎలాంటి శ్రమ లేకుండా పెరిగిన నేపథ్యం ఉన్నవారే కావడంతో భూగర్భ గనుల్లో శ్రమించేందుకు ఇబ్బంది పడుతున్నారు.

ఒకసారి కోల్ కట్టర్ ప్రమోషన్ లెటర్ తీసుకుంటే జీవితాంతం అండర్ గ్రౌండ్ మైన్లోనే పనిచేయాల్సి ఉంటుంది. దీనికి తోడు శ్రమతో కూడుకున్నదనే ఉద్దేశంతో యువకార్మికులు దాని వైపు వెళ్లడం లేదు. దీని ప్రమోషన్ లెటర్లు తీసుకోవడానికి కూడా అయిష్టతను చూపుతున్నారు. కష్టమనుకోకుండా పని చేస్తే..బాయికి కోల్ కట్టరే రాజు అని సీనియర్ కార్మికులు పేర్కొంటున్నారు. తన పనిని పూర్తి చేస్తే ప్రశ్నించే వారే ఉండరని చెబుతున్నారు. కోల్ కట్టర్ ఎంతో హుందాగా ఉండే డిసిగ్నేషన్ అని వారు అంటున్నారు.

అయితే ప్రస్తుతం కంపెనీలో కోల్కట్టర్ డిజిగ్నేషన్ అవసరం ఎంతో ఉంది. అందరూ తెలికపాటి పనులకు వెళ్తామంటే, కంపెనీ భవిష్యత్తు ఎంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంపెనీలో ఉద్యోగంలో చేరిన తరువాత ప్రతీ కార్మికుడికి సంస్థ బదిలీ వర్కర్ డిసిగ్నేషన్ ఇస్తుంది. భూగర్భ గనిలో ఏడాదిలో 190 మస్టర్లు నిండితే అతడిని పర్మినెంట్ జనరల్ మజ్ధార్ డిజిగ్నేషన్ గా ఇస్తారు. ఇలా ఈ డిజిగ్నేషన్లలో ఉన్న ఖాళీలను బట్టి ఎవరు ఎక్కువ యాక్టింగ్టు చేస్తే వారి ప్యానల్ లిస్ట్ ఆధారంగా వారికి యాజమాన్యం పదోన్నతి ఇస్తుంది. మిగితా డిసిగ్నేషన్లు తీసుకుంటున్న యువ కార్మికులు కోల్కట్టర్ పదోన్నతి స్వీకరణకు ఆసక్తి చూపడం లేదు. తాము జనరల్ మల్ధార్ గానే ఉంటామంటూ పదోన్నతి లేఖలు తిరిగి పంపిస్తున్నారు.

ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం యువకార్మికులకు వారి పని ప్రాధ్యాన్యత తెలియజేసి శిక్షనా తరగతులు నిర్వహించాలని కార్మిక సంఘాల నాయకులు సూచిస్తున్నారు. పనిని కష్టపడి కాకుండా ఇష్టపడి చేసేలా..అవగాహన కల్పిస్తే ఇబ్బందులను అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories