సీఎం రేవంత్ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ
x
Highlights

జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర-2026 పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర-2026 పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క ముఖ్యమంత్రికి సమ్మక్క తల్లి కంకణం కట్టి, బొట్టు పెట్టారు. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు, బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు అని ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి సంస్కృతి మన అస్థిత్వం, వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర అన్నారు. వారి త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి, సమ్మక్క - సారక్క మనుషుల్లో దేవుళ్లుని అన్నారు. ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి, వారి చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పం మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సత్కార్యం అని సీఎం వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories