Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి స్పందించిన సీఎం రేవంత్..ఏమన్నారంటే?

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి స్పందించిన సీఎం రేవంత్..ఏమన్నారంటే?
x
Highlights

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. పుష్ప2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్...

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. పుష్ప2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటన, తర్వాత పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంగ్ రెడ్డి మరోసారి స్పందించారు.

తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా..రెండు రోజుల ముందు అనుమతికోసం వస్తే పోలీసులు నిరాకరించారు. అయినా కూడా థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడి వారిని తోసేయడం..ఆ తొక్కిసలాటలో ఒకరు మరణించారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. ఒక మహిళ చనిపోతే పది పన్నేండు రోజులు బాధిత కుటుంబాన్ని ఆయన పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories