నేడు కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will Meet with the Collectors Today
x

నేడు కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి 

Highlights

Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి మీటింగ్

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సచివాయంలో సమావేశం కానున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజాపాలన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది.

కాగా.. తొలి రోజు నుంచే దీనికి విశేష స్పందన వచ్చింది. అయితే.. వచ్చిన సమస్యల్లో మెజారిటీ గ్రామ, మండల స్థాయిలో ఉండటం వల్ల.. ఇకపై ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్ల సమావేశంలో వెల్లడించనున్నట్టు తెలుస్తుంది.

ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దకేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారీగా ఉండేందుకు ప్రజా పాలన చేపడుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించనుంది. దీనికి తగ్గట్టుగా అధికారులను సమాయత్తం చేసేందుకు సీఎం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories