MSME Policy: ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

MSME Policy: ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
x

CM Revanth Reddy: ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సాహం

Highlights

MSME Policy: ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

MSME Policy: ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పకళా వేదికలో MSME- 2024 నూతన పాలసీని సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీపడేలా పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారన్నారు. విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకే.. ఈ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories