Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy to Komati Reddy Rajagopal Reddy house
x

Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: భువనగిరి పార్లమెంట్‌పై ఎన్నికలపై సమీక్ష సమావేశం

Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఎన్నకల్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రెండంకెల సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను దింపింది. బలమైన అభ్యర్థులు లేరని భావించిన స్థానం కోసం ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకుని మరీ సీట్లు ఇచ్చింది. ఇక మొన్నటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లోక‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంట్‌పై ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. భువనగిరి పార్లమెంట్‌కు ఇంఛార్జీగా రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌ కుమార్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories