Revanth Reddy: గ్రేటర్ ట్రాఫిక్‌‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy Review On Greater Traffic
x

Revanth Reddy: గ్రేటర్ ట్రాఫిక్‌‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 

Highlights

Revanth Reddy: మల్టీలెవన్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష చేశారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, మూడు కమిషనరేట్ల సీపీలు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీ.. దానిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను సిటీ పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని.. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే 3 నెలల్లోగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సిటీ పరిధిలో అన్ని జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని.. అందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories