Medaram: మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Medaram: మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
x

Medaram: మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Medaram : ములుగు జిల్లా మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పునఃప్రారంభించారు. కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Medaram: ములుగు జిల్లా మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని దేవతలకు సమర్పించారు.

అనంతరం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మేడారం గద్దెల ప్రాంగణానికి కుటుంబ సమేతంగా చేరుకున్న సీఎంకు ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడారం జాతర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గద్దెలు, ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులు పూర్తి చేసిన అనంతరం పునఃప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories