Revanth Reddy: మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy Reacts On Nalini Job
x

Revanth Reddy: మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Highlights

Revanth Reddy: మరోసారి తెరపైకి మాజీ డీఎస్పీ నళిని

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కష్టపడి సంపాధించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డీఎస్పీ నళిని.. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి కొత్త ప్రభుత్వంలో మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలంటూ.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఎమిటని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆయన ఆదేశించారు.

పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సచివాలయంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకుండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories