Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ మహాగణపతి తొలి పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్.. సాయంత్రం రానున్న గవర్నర్..

CM Revanth Reddy Perform First Pooja To Khairatabad Ganesh
x

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ మహాగణపతి తొలి పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్.. సాయంత్రం రానున్న గవర్నర్..

Highlights

Khairatabad Ganesh: భాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు.

Khairatabad Ganesh: భాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. మహా గణపతి పూజలకు ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలిపూజలో పాల్గొననున్నారు.

సాయంత్రం 3 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌లు పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 1954లో ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం ప్రారంభమైంది. 70 వసంతాలు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories