Revanth Reddy: గవర్నర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

CM Revanth Reddy met with the Governor
x

Revanth Reddy: గవర్నర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

Highlights

Revanth Reddy: 2గంటల పాటు కొనసాగిన సమావేశం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సమావేశం అయ్యారు. మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న సీఎం..2.55 గంటల వరకు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణ, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, రాష్ట్ర విభజన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 7 తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో అంతకు ముందే కేబినెట్ విస్తరణ చేపట్టాలనే భావనతో పార్టీ వర్గాలు ఉన్నాయి. దీంతో గవర్నర్‌తో సీఎం భేటీ..ప్రాధ్యానత సంతరించుకుంది.

మరోవైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్‌ చట్టంతో పాటు భూ చట్టాల బిల్లుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీ అనంతరం ఆగస్టు 15 సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీల విడుదలకు గవర్నర్ పచ్చజెండా ఊపారు. దీంతో 231మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories