'Stand With Her’ Campaign: మహిళల భద్రత కోసం ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి


'Stand With Her’ Campaign: మహిళల భద్రత కోసం ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
'Stand With Her’ Campaign: హైదరాబాద్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మహిళల భద్రత కోసం సమాజంలో పురుషులు కూడా ముందుకు రావాలనే సందేశంతో “స్టాండ్ విత్ హర్” అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం ఉదయం 11:30 గంటలకు జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్యాంపెయిన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. మహిళల భద్రతను ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తు చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా పోలీస్ కమిషనర్లు సజ్జనార్ మరియు సైబరాబాద్ సీపీ రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇక ఈ అవగాహన కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు సాయి దుర్గ తేజ్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచడం, మహిళల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ క్యాంపెయిన్‌ను తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం నిర్వహిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



