Revanth Reddy: అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

CM Revanth Reddy is busy in America
x

Revanth Reddy: అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

Highlights

Revanth Reddy: కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​కంపెనీ ప్రముఖులతో సమావేశం

Revanth Reddy: ఇకపై రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్​లైన్​తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్‌కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సీఎం...అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని సీఎం ప్రస్తావించారు. న్యూయార్క్ స్టేట్‌ను అవుటాఫ్ మెనీ వన్ అని, టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్‌గా పిలవగా, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని వివరించారు. భారత దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్న ఆయన..ఇప్పటి నుంచి తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్​లైన్‌తో లక్ష్య నినాదాన్నిగా పెట్టుకుందామన్నారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి.శ్రీధర్​బాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories