Revanth Reddy: హైదరాబాద్‌ అంటేనే చార్మినార్‌, ట్యాంక్‌బండ్.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గుర్తొస్తాయి

CM Revanth Reddy Inaugurated the Nampally Numaish Exhibition
x

Revanth Reddy: హైదరాబాద్‌ అంటేనే చార్మినార్‌, ట్యాంక్‌బండ్.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గుర్తొస్తాయి

Highlights

Revanth Reddy: ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం.. ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయం

Revanth Reddy: హైదరాబాద్‌కు ఓ బ్రాండ్‌కు మారిన నుమాయిష్‌ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లి గ్రౌండ్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. హైదరాబాద్‌ అంటేనే చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గుర్తొస్తాయన్నారు సీఎం రేవంత్. నుమాయిష్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు.

నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్‌ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. నునాయిష్ కు వచ్చే వ్యాపారులకు, ప్రజలకు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. గతంలో తాను కూడా వచ్చి ఫుడ్ కోర్ట్ లను విజిట్ చేసేవాడినని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ నుమాయిష్‌ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని కొనియాడారు. సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, సీఎం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories